పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రేపు నిత్యావసరాలు పంపిణీ


ఖమ్మం : మే డే సందర్భంగా పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది కార్మికులకు రేపు నిత్యావసర సరుకులను నిర్వాహకులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు. గ్రైన్‌ మార్కెట్‌ కార్మికులు, గోల్డ్‌ షాప్‌ వర్కర్స్‌, సుతారి, నాయి బ్రహ్మణులు, పెయింటర్స్‌, బైక్‌ మెకానిక్స్‌, ఎలక్ట్రిషియన్స్‌, ఆర్టిస్టులు, టైలరింగ్‌, ప్లాస్ట్‌ ఆఫ్‌ పారిస్‌ యూనియన్‌ కార్మికులు, వాటర్‌ సర్వీసింగ్‌, కార్పెంటర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ డ్రైవర్స్‌కు కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.